హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, అక్టోబర్ 25, 2016

సర్ప బాధా నివృత్తి శ్లోకం

సర్ప బాధా నివృత్తి శ్లోకం

అనంతో, వాసుకి, శేష, పద్మనాభశ్చ, కంబల,
ధ్రుతరాష్ట్ర , శంఖ పాల , తక్షక, కాలియ స్థధ!

యేతాని నవ నామాని నాగానాం చ మహత్మానాం,
సాయం కలె పఠేన్ నిత్య, ప్రాత: కాలె విశేషత!

నర్మదాయై నమ, ప్రాత నర్మదాతై నమొ నిష,
నమోస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విష సర్పత!

అసితం చార్తిమందం చ సునీధిం చాపి య స్మరేథ్,
దివ వా యాఅధి వా రాత్రౌ నాస్య సర్ప భయం భవేథ్!

యో జరత్ కారుణొ జాతో జరత్ కారౌ మహ యశ,
ఆష్టీక సర్ప సాత్రే వా పన్నగం యో అభ్యరక్షత!

తం స్మరంతం మహా భాగా నామం హింసితు మర్హత

సర్వసర్ప భద్రం తే దూరం గచ మహ యశ,
జనమేజయశ్య యజ్ఞంతే ఆష్టీక వచనం స్మరాన్
ఓం శ్రీ నాగరాజాయతే నమ:

గురువారం, అక్టోబర్ 20, 2016

కోరికలు నెరవేరుటకు మంత్రములు 2

See My 4 Blogs - P.V.Radhakrishna 
cell: 9966455872, 7013390324, 9966680542
About Us : https://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/p/blog-page_1.html 
Astrology Blog 
శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం 
http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in


Devotional Blog 
సాధన ఆరాధన  https://sadhanaaradhana.blogspot.in/

Telugu Literature Blog 
తెలుగు పండిత దర్శిని
 http://teluguteachers-parakri.blogspot.in


My Writings - Blog 
పరాక్రి పదనిసలు
Social Search as : PARAKRIJAYA
నూతన సమాచారం కోసం
సంప్రదించుటకు : parakrijaya@gmail.com
#stotras , #mantras , #దేవిదేవతలు , #Vedic , #స్తోత్రం , #మంత్రం , #వేద , #పరాక్రి , #parakrijaya , #telugu , #తెలుగు , #అడియో , #AudioMantras , #god , #goddess , #Devotional

బుధవారం, అక్టోబర్ 19, 2016

కోరికలు నెరవేరుటకు మంత్రములు 1

See My 4 Blogs - P.V.Radhakrishna 
cell: 9966455872, 7013390324, 9966680542
About Us : https://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/p/blog-page_1.html 
Astrology Blog 
శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం 
http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
Devotional Blog 
సాధన ఆరాధన  https://sadhanaaradhana.blogspot.in/

Telugu Literature Blog 
తెలుగు పండిత దర్శిని
 http://teluguteachers-parakri.blogspot.in
My Writings - Blog 
పరాక్రి పదనిసలు
Social Search as : PARAKRIJAYA
నూతన సమాచారం కోసం
సంప్రదించుటకు : parakrijaya@gmail.com
#stotras , #mantras , #దేవిదేవతలు , #Vedic , #స్తోత్రం , #మంత్రం , #వేద , #పరాక్రి , #parakrijaya , #telugu , #తెలుగు , #అడియో , #AudioMantras , #god , #goddess , #Devotional

సోమవారం, అక్టోబర్ 17, 2016

నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య పారాయణ శ్లోకాలు


ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు..
ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడికి భక్తితో నమస్కరించి తొలి పూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆదిదేవుడు కాపాడుతాడని అందరి నమ్మకం...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ గణనాధుని ఆశీర్వాలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, తెలుగు భక్తిని మీకు అందినస్తున్నాం .

ప్రభాత శ్లోకం 
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ || 

ప్రభాత భూమి శ్లోకం 
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||

సంధ్యా దీప దర్శన శ్లోకం 
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే ||

సూర్యోదయ శ్లోకం
 బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||

స్నాన శ్లోకం 
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||

భస్మ ధారణ శ్లోకం 
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ |
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ||

గణేశ స్తోత్రం
 శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||


భోజన పూర్వ శ్లోకం 
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే |
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||

భోజనానంతర శ్లోకం
 అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ |
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||

నిద్రా శ్లోకం
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ |
శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి ||

కార్య ప్రారంభ శ్లోకం 
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||

గాయత్రి మంత్రం 
ఓం భూర్భుస్సువః | తథ్స’వితుర్వరే”ణ్యం |
భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

హనుమ స్తోత్రం 
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||

శ్రీరామ స్తోత్రం 
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

శివ స్తోత్రం

త్ర్యం’బకం యజామహే సుంధిం పు’ష్టివర్ధ’నమ్ | 
ర్వారుకమి’ బంధ’నాన్-మృత్యో’ర్-ముక్షీ మా‌உమృతా”త్ ||

గురు శ్లోకం 
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

సరస్వతీ శ్లోకం 
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |

లక్ష్మీ శ్లోకం 
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||

వేంకటేశ్వర శ్లోకం 
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌உర్థినామ్ |
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

దేవీ శ్లోకం
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||

దక్షిణామూర్తి శ్లోకం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

అపరాధ క్షమాపణ స్తోత్రం 
అపరాధ సహస్రాణి, క్రియంతే‌உహర్నిశం మయా |
దాసో‌உయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||

శాంతి మంత్రం
అసతోమా సద్గమయా |
తమసోమా జ్యోతిర్గమయా |
మృత్యోర్మా అమృతంగమయా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ||
ఓం హ నా’వవతు |  నౌ’ భునక్తు | హ వీర్యం’ కరవావహై | 
తేస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” || 
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

విశేష మంత్రాః 
పంచాక్షరి – ఓం నమశ్శివాయ
అష్టాక్షరి – ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి – ఓం నమో భగవతే వాసుదేవాయ



Pooja Book (నిత్య పారాయణ శ్లోకాలు ) :

సోమవారం, అక్టోబర్ 10, 2016

దుర్గాష్టమి - మహర్నవమి - విజయదశమి (దసరా)

దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా):

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది. 

దుర్గాష్టమి:
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము, 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈదుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము", అని అంటారు. 

మహర్నవమి:
మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈనవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈనవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు. 

విజయదశమి:
దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము. 

'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు. 

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు. 
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు. 

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ | 
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ || 
పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

కాళీశతనామస్తోత్రమ్

॥ కాళీశతనామస్తోత్రమ్ బృహన్నీలతన్త్రార్గతమ్ ॥

 శ్రీదేవ్యువాచ । పురా ప్రతిశ్రుతం దేవ క్రీడాసక్తో యదా భవాన్ । నామ్నాం శతం మహాకాల్యాః కథయస్వ మయి ప్రభో ॥ ౨౩-౧॥ 

శ్రీభైరవ ఉవాచ । సాధు పృష్టం మహాదేవి అకథ్యం కథయామి తే । న ప్రకాశ్యం వరారోహే స్వయోనిరివ సున్దరి ॥ ౨౩-౨॥ 

ప్రాణాధికప్రియతరా భవతీ మమ మోహినీ । క్షణమాత్రం న జీవామి త్వాం బినా పరమేశ్వరి ॥ ౨౩-౩॥ 

యథాదర్శేఽమలే బిమ్బం ఘృతం దధ్యాదిసంయుతమ్ । తథాహం జగతామాద్యే త్వయి సర్వత్ర గోచరః ॥ ౨౩-౪॥ 

శృణు దేవి ప్రవక్ష్యామి జపాత్ సార్వజ్ఞదాయకమ్ । సదాశివ ఋషిః ప్రోక్తోఽనుష్టుప్ ఛన్దశ్చ ఈరితః ॥ ౨౩-౫॥ 

దేవతా భైరవో దేవి పురుషార్థచతుష్టయే । వినియోగః ప్రయోక్తవ్యః సర్వకర్మఫలప్రదః ॥ ౨౩-౬॥ 

మహాకాలీ జగద్ధాత్రీ జగన్మాతా జగన్మయీ । జగదమ్బా గజత్సారా జగదానన్దకారిణీ ॥ ౨౩-౭॥ 

జగద్విధ్వంసినీ గౌరీ దుఃఖదారిద్ర్యనాశినీ । భైరవభావినీ భావానన్తా సారస్వతప్రదా ॥ ౨౩-౮॥ 

చతుర్వర్గప్రదా సాధ్వీ సర్వమఙ్గలమఙ్గలా । భద్రకాలీ విశాలాక్షీ కామదాత్రీ కలాత్మికా ॥ ౨౩-౯॥ 

నీలవాణీ మహాగౌరసర్వాఙ్గా సున్దరీ పరా । సర్వసమ్పత్ప్రదా భీమనాదినీ వరవర్ణినీ ॥ ౨౩-౧౦॥

 వరారోహా శివరుహా మహిషాసురఘాతినీ । శివపూజ్యా శివప్రీతా దానవేన్ద్రప్రపూజితా ॥ ౨౩-౧౧॥ 

సర్వవిద్యామయీ శర్వసర్వాభీష్టఫలప్రదా । కోమలాఙ్గీ విధాత్రీ చ విధాతృవరదాయినీ ॥ ౨౩-౧౨॥

 పూర్ణేన్దువదనా నీలమేఘవర్ణా కపాలినీ । కురుకుల్లా విప్రచిత్తా కాన్తచిత్తా మదోన్మదా ॥ ౨౩-౧౩॥ 

మత్తాఙ్గీ మదనప్రీతా మదాఘూర్ణితలోచనా । మదోత్తీర్ణా ఖర్పరాసినరముణ్డవిలాసినీ ॥ ౨౩-౧౪॥ 

నరముణ్డస్రజా దేవీ ఖడ్గహస్తా భయానకా । అట్టహాసయుతా పద్మా పద్మరాగోపశోభితా ॥ ౨౩-౧౫॥ 

వరాభయప్రదా కాలీ కాలరాత్రిస్వరూపిణీ । స్వధా స్వాహా వషట్కారా శరదిన్దుసమప్రభా ॥ ౨౩-౧౬॥

 శరత్జ్యోత్స్నా చ సంహ్లాదా విపరీతరతాతురా । ముక్తకేశీ ఛిన్నజటా జటాజూటవిలాసినీ ॥ ౨౩-౧౭॥ 

సర్పరాజయుతాభీమా సర్పరాజోపరి స్థితా । శ్మశానస్థా మహానన్దిస్తుతా సందీప్తలోచనా ॥ ౨౩-౧౮॥

 శవాసనరతా నన్దా సిద్ధచారణసేవితా । బలిదానప్రియా గర్భా భూర్భువఃస్వఃస్వరూపిణీ ॥ ౨౩-౧౯॥ 

గాయత్రీ చైవ సావిత్రీ మహానీలసరస్వతీ । లక్ష్మీర్లక్షణసంయుక్తా సర్వలక్షణలక్షితా ॥ ౨౩-౨౦॥

 వ్యాఘ్రచర్మావృతా మేధ్యా త్రివలీవలయాఞ్చితా । గన్ధర్వైః సంస్తుతా సా హి తథా చేన్దా మహాపరా ॥ ౨౩-౨౧॥ 

పవిత్రా పరమా మాయా మహామాయా మహోదయా । ఇతి తే కథితం దివ్యం శతం నామ్నాం మహేశ్వరి ॥ ౨౩-౨౨॥ 

యః పఠేత్ ప్రాతరుత్థాయ స తు విద్యానిధిర్భవేత్ । ఇహ లోకే సుఖం భుక్త్వా దేవీసాయుజ్యమాప్నుయాత్ ॥ ౨౩-౨౩॥ 

తస్య వశ్యా భవన్త్యేతే సిద్ధౌఘాః సచరాచరాః । ఖేచరా భూచరాశ్చైవ తథా స్వర్గచరాశ్చ యే ॥ ౨౩-౨౪॥ 

తే సర్వే వశమాయాన్తి సాధకస్య హి నాన్యథా । నామ్నాం వరం మహేశాని పరిత్యజ్య సహస్రకమ్ ॥ ౨౩-౨౫॥ 

పఠితవ్యం శతం దేవి చతుర్వర్గఫలప్రదమ్ । అజ్ఞాత్వా పరమేశాని నామ్నాం శతం మహేశ్వరి ॥ ౨౩-౨౬॥ 

భజతే యో మహకాలీం సిద్ధిర్నాస్తి కలౌ యుగే । ప్రపఠేత్ ప్రయతో భక్త్యా తస్య పుణ్యఫలం శృణు ॥ ౨౩-౨౭॥ 

లక్షవర్షసహస్రస్య కాలీపూజాఫలం భవేత్ । బహునా కిమిహోక్తేన వాఞ్ఛితార్థీ భవిష్యతి ॥ ౨౩-౨౮॥ 

ఇతి శ్రీబృహన్నీలతన్త్రే భైరవపార్వతీసంవాదే కాలీశతనామనిరూపణం త్రయోవింశః పటలః ॥ ౨౩॥


🌷దశహర అనే సoస్కృత పదం క్రమంగా దసరాగా మారింది.  మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పoడుగ

🎆కామ (Lust)
🎆క్రోధ (Anger)
🎆మోహ (Attachment)
🎆లోభ (Greed)
🎆మద (Over Pride)
🎆మాత్సర్య (Jealousy)
🎆స్వార్థ (Selfishness)
🎆అన్యాయ (Injustice)
🎆అమానవత్వ (Cruelty)
🎆అహంకార (Ego)

ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి"  అనికూడా అంటారు.

అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ,  అందరికీ శరన్నవరాత్రి శుభాకాoక్షలు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...