హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, అక్టోబర్ 10, 2016

కాళీశతనామస్తోత్రమ్

॥ కాళీశతనామస్తోత్రమ్ బృహన్నీలతన్త్రార్గతమ్ ॥

 శ్రీదేవ్యువాచ । పురా ప్రతిశ్రుతం దేవ క్రీడాసక్తో యదా భవాన్ । నామ్నాం శతం మహాకాల్యాః కథయస్వ మయి ప్రభో ॥ ౨౩-౧॥ 

శ్రీభైరవ ఉవాచ । సాధు పృష్టం మహాదేవి అకథ్యం కథయామి తే । న ప్రకాశ్యం వరారోహే స్వయోనిరివ సున్దరి ॥ ౨౩-౨॥ 

ప్రాణాధికప్రియతరా భవతీ మమ మోహినీ । క్షణమాత్రం న జీవామి త్వాం బినా పరమేశ్వరి ॥ ౨౩-౩॥ 

యథాదర్శేఽమలే బిమ్బం ఘృతం దధ్యాదిసంయుతమ్ । తథాహం జగతామాద్యే త్వయి సర్వత్ర గోచరః ॥ ౨౩-౪॥ 

శృణు దేవి ప్రవక్ష్యామి జపాత్ సార్వజ్ఞదాయకమ్ । సదాశివ ఋషిః ప్రోక్తోఽనుష్టుప్ ఛన్దశ్చ ఈరితః ॥ ౨౩-౫॥ 

దేవతా భైరవో దేవి పురుషార్థచతుష్టయే । వినియోగః ప్రయోక్తవ్యః సర్వకర్మఫలప్రదః ॥ ౨౩-౬॥ 

మహాకాలీ జగద్ధాత్రీ జగన్మాతా జగన్మయీ । జగదమ్బా గజత్సారా జగదానన్దకారిణీ ॥ ౨౩-౭॥ 

జగద్విధ్వంసినీ గౌరీ దుఃఖదారిద్ర్యనాశినీ । భైరవభావినీ భావానన్తా సారస్వతప్రదా ॥ ౨౩-౮॥ 

చతుర్వర్గప్రదా సాధ్వీ సర్వమఙ్గలమఙ్గలా । భద్రకాలీ విశాలాక్షీ కామదాత్రీ కలాత్మికా ॥ ౨౩-౯॥ 

నీలవాణీ మహాగౌరసర్వాఙ్గా సున్దరీ పరా । సర్వసమ్పత్ప్రదా భీమనాదినీ వరవర్ణినీ ॥ ౨౩-౧౦॥

 వరారోహా శివరుహా మహిషాసురఘాతినీ । శివపూజ్యా శివప్రీతా దానవేన్ద్రప్రపూజితా ॥ ౨౩-౧౧॥ 

సర్వవిద్యామయీ శర్వసర్వాభీష్టఫలప్రదా । కోమలాఙ్గీ విధాత్రీ చ విధాతృవరదాయినీ ॥ ౨౩-౧౨॥

 పూర్ణేన్దువదనా నీలమేఘవర్ణా కపాలినీ । కురుకుల్లా విప్రచిత్తా కాన్తచిత్తా మదోన్మదా ॥ ౨౩-౧౩॥ 

మత్తాఙ్గీ మదనప్రీతా మదాఘూర్ణితలోచనా । మదోత్తీర్ణా ఖర్పరాసినరముణ్డవిలాసినీ ॥ ౨౩-౧౪॥ 

నరముణ్డస్రజా దేవీ ఖడ్గహస్తా భయానకా । అట్టహాసయుతా పద్మా పద్మరాగోపశోభితా ॥ ౨౩-౧౫॥ 

వరాభయప్రదా కాలీ కాలరాత్రిస్వరూపిణీ । స్వధా స్వాహా వషట్కారా శరదిన్దుసమప్రభా ॥ ౨౩-౧౬॥

 శరత్జ్యోత్స్నా చ సంహ్లాదా విపరీతరతాతురా । ముక్తకేశీ ఛిన్నజటా జటాజూటవిలాసినీ ॥ ౨౩-౧౭॥ 

సర్పరాజయుతాభీమా సర్పరాజోపరి స్థితా । శ్మశానస్థా మహానన్దిస్తుతా సందీప్తలోచనా ॥ ౨౩-౧౮॥

 శవాసనరతా నన్దా సిద్ధచారణసేవితా । బలిదానప్రియా గర్భా భూర్భువఃస్వఃస్వరూపిణీ ॥ ౨౩-౧౯॥ 

గాయత్రీ చైవ సావిత్రీ మహానీలసరస్వతీ । లక్ష్మీర్లక్షణసంయుక్తా సర్వలక్షణలక్షితా ॥ ౨౩-౨౦॥

 వ్యాఘ్రచర్మావృతా మేధ్యా త్రివలీవలయాఞ్చితా । గన్ధర్వైః సంస్తుతా సా హి తథా చేన్దా మహాపరా ॥ ౨౩-౨౧॥ 

పవిత్రా పరమా మాయా మహామాయా మహోదయా । ఇతి తే కథితం దివ్యం శతం నామ్నాం మహేశ్వరి ॥ ౨౩-౨౨॥ 

యః పఠేత్ ప్రాతరుత్థాయ స తు విద్యానిధిర్భవేత్ । ఇహ లోకే సుఖం భుక్త్వా దేవీసాయుజ్యమాప్నుయాత్ ॥ ౨౩-౨౩॥ 

తస్య వశ్యా భవన్త్యేతే సిద్ధౌఘాః సచరాచరాః । ఖేచరా భూచరాశ్చైవ తథా స్వర్గచరాశ్చ యే ॥ ౨౩-౨౪॥ 

తే సర్వే వశమాయాన్తి సాధకస్య హి నాన్యథా । నామ్నాం వరం మహేశాని పరిత్యజ్య సహస్రకమ్ ॥ ౨౩-౨౫॥ 

పఠితవ్యం శతం దేవి చతుర్వర్గఫలప్రదమ్ । అజ్ఞాత్వా పరమేశాని నామ్నాం శతం మహేశ్వరి ॥ ౨౩-౨౬॥ 

భజతే యో మహకాలీం సిద్ధిర్నాస్తి కలౌ యుగే । ప్రపఠేత్ ప్రయతో భక్త్యా తస్య పుణ్యఫలం శృణు ॥ ౨౩-౨౭॥ 

లక్షవర్షసహస్రస్య కాలీపూజాఫలం భవేత్ । బహునా కిమిహోక్తేన వాఞ్ఛితార్థీ భవిష్యతి ॥ ౨౩-౨౮॥ 

ఇతి శ్రీబృహన్నీలతన్త్రే భైరవపార్వతీసంవాదే కాలీశతనామనిరూపణం త్రయోవింశః పటలః ॥ ౨౩॥


🌷దశహర అనే సoస్కృత పదం క్రమంగా దసరాగా మారింది.  మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పoడుగ

🎆కామ (Lust)
🎆క్రోధ (Anger)
🎆మోహ (Attachment)
🎆లోభ (Greed)
🎆మద (Over Pride)
🎆మాత్సర్య (Jealousy)
🎆స్వార్థ (Selfishness)
🎆అన్యాయ (Injustice)
🎆అమానవత్వ (Cruelty)
🎆అహంకార (Ego)

ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి"  అనికూడా అంటారు.

అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ,  అందరికీ శరన్నవరాత్రి శుభాకాoక్షలు.

గురువారం, సెప్టెంబర్ 29, 2016

నవగ్రహ శాంతికి పూజించాల్సిన మొక్కలు ఇవే.....

నవగ్రహ శాంతికి పూజించాల్సిన మొక్కలు ఇవే


1.రవి గ్రహమునకు సంబందించిన తెల్లజిల్లేడు మొక్కలను నాటడము పూజించడము
2. చంద్ర గ్రహమునకు సంబందించిన మోదుగ మొక్కలను నాటడము పూజించడము.
3.కుజ గ్రహమునకు సంబందించిన చండ్ర (ఖదిర) మొక్కలను నాటడము పూజించడము. 
4.రాహు గ్రహమునకు సంబందించిన గరిక మొక్కలను నాటడము పూజించడము. 
5. గురు గ్రహమునకు సంబందించిన రావి మొక్కలను నాటడము పూజించడము.
6.శని గ్రహమునకు సంబందించిన జమ్మి మొక్కలను నాటడము పూజించడము. 
7. బుధ గ్రహమునకు సంబందించిన ఉత్తరేణి మొక్కలను నాటడము పూజించడము.
8. కేతు గ్రహమునకు సంబందించిన ధర్భ మొక్కలను నాటడము పూజించడము
9. శుక్ర గ్రహమునకు సంబందించిన మేడి మొక్కలను నాటడము పూజించడము.


నవగ్రహాల ఆధిపత్యంలో కష్టసుఖాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కానీ నవగ్రహాలను శాంతి పరచడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం ఆయా గ్రహాధిపత్యంలో పుట్టిన జాతకులు తమ గ్రహాధిపత్య సంచారాన్ని అనుసరించి పూజ, దానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. 



నవగ్రహ శాంతికి సంబంధించి జాతక ప్రకారం పూజాది కార్యక్రమాలు చేయాలనుకునేవారు నవగ్రహాలకు ప్రీతికరమైన వస్తువులతో పూజ, దానాది కార్యక్రమాలను నిర్వహించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నవగ్రహ పూజలో భాగంగా గ్రహ శాంతికి, దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇందులో సూర్యగ్రహ శాంతి కోసం పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. ఈ జాతకులు చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది. 

గురు గ్రహానికి పూజ నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల వీరికి అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం చంద్రుణ్ణి పూజించి బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది.

ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చ ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. 

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి.

గురువారం, ఏప్రిల్ 14, 2016

శ్రీరామ మంగళా శాసనం

శ్రీరామ మంగళా శాసనం

మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || 1 ||

వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే |
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ || 2 ||

విశ్వామిత్రాంత రంగాయ మిథిలా నగరీ పతే |
భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమ్ || 3 ||

పిత్రుభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా |
నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళమ్ || 4 ||

త్యక్త సాకేత వాసాయ చిత్రకూట విహారిణే |
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్ || 5 ||

సౌమిత్రిణాచ జానక్యా చాప బాణాసి ధారిణే |
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్ || 6 ||

దండకారణ్య వాసాయ ఖరదూషణ శత్రవే |
గృధ్ర రాజాయ భక్తాయ ముక్తి దాయాస్తు మంగళమ్ || 7 ||

సాదరం శబరీ దత్త ఫలమూల భిలాషిణే |
సౌలభ్య పరిపూర్ణాయ సత్యోద్రిక్తాయ మంగళమ్ || 8 ||

హనుంత్సమవేతాయ హరీశాభీష్ట దాయినే |
వాలి ప్రమధ నాయాస్తు మహాధీరాయ మంగళమ్ || 9 ||

శ్రీమతే రఘు వీరాయ సేతూల్లంఘిత సింధవే |
జితరాక్షస రాజాయ రణధీరాయ మంగళమ్ || 10 ||

విభీషణ కృతే ప్రీత్యా లంకాభీష్ట ప్రదాయినే |
సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్ || 11 ||

ఆగత్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా |
రాజాధి రాజ రాజాయ రామభద్రాయ మంగళమ్ || 12 ||

భ్రహ్మాది దేవసేవ్యాయ భ్రహ్మణ్యాయ మహాత్మనే |
జానకీ ప్రాణ నాథాయ రఘునాథాయ మంగళమ్ || 13 ||

శ్రీసౌమ్య జామాతృమునేః కృపయాస్మాను పేయుషే |
మహతే మమ నాథాయ రఘునాథాయ మంగళమ్ || 14 ||

మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై |
సర్వైశ్చ పూర్వైరాచార్ర్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 15 ||

రమ్యజా మాతృ మునినా మంగళా శాసనం కృతమ్ |
త్రైలోక్యాధిపతిః శ్రీమాన్ కరోతు మంగళం సదా ||

ఏక శ్లోకీ రామాయణం - నామరామాయణం

ఏక శ్లోకీ రామాయణం

ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||

నామరామాయణం

రామ రామ జయ రాజారామ |
రామ రామ జయ సీతారామ |

బాలకాండము-
శుద్ధబ్రహ్మపరాత్పర రామ | కాలాత్మకపరమేశ్వర రామ |
శేషతల్పసుఖనిద్రిత రామ | బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
చండకిరణకులమండన రామ | శ్రీమద్దశరథనందన రామ |
కౌసల్యాసుఖవర్ధన రామ | విశ్వామిత్రప్రియధన రామ |
ఘోరతాటకాఘాతుక రామ | మారీచాదినిపాతక రామ |
కౌశికమఖసంరక్షక రామ | శ్రీమదహల్యోద్ధారక రామ |
గౌతమమునిసంపూజిత రామ | సురమునివరగణసంస్తుత రామ |
నావికధావికమృదుపద రామ | మిథిలాపురజనమోహక రామ |
విదేహమానసరంజక రామ | త్ర్యంబకకార్ముకభంజక రామ |
సీతార్పితవరమాలిక రామ | కృతవైవాహికకౌతుక రామ |
భార్గవదర్పవినాశక రామ | శ్రీమదయోధ్యాపాలక రామ |

అయోధ్యాకాండము-
అగణితగుణగణభూషిత రామ | అవనీతనయాకామిత రామ |
రాకాచంద్రసమానన రామ | పితృవాక్యాశ్రితకానన రామ |
ప్రియగుహవినివేదితపద రామ | ప్రక్షాళితనిజమృదుపద రామ |
భరద్వాజముఖానందక రామ | చిత్రకూటాద్రినికేతన రామ |
దశరథసంతతచింతిత రామ | కైకేయీతనయార్పిత రామ |
విరచితనిజపితృకర్మక రామ | భరతార్పితనిజపాదుక రామ |

అరణ్యకాండము-
దండకావనజనపావన రామ | దుష్టవిరాధవినాశన రామ |
శరభంగసుతీక్ష్ణార్చిత రామ | అగస్త్యానుగ్రహవర్ధిత రామ |
గృధ్రాధిపసంసేవిత రామ | పంచవటీతటసుస్థిత రామ |
శూర్పణఖార్తివిధాయక రామ | ఖరదూషణముఖసూదక రామ |
సీతాప్రియహరిణానుగ రామ | మారీచార్తికృతాశుగ రామ |
వినష్టసీతాన్వేషక రామ | గృధ్రాధిపగతిదాయక రామ |
శబరీదత్తఫలాశన రామ | కబంధబాహుచ్ఛేదన రామ |

కిష్కింధాకాండము-
హనుమత్సేవితనిజపద రామ | నతసుగ్రీవాభీష్టద రామ |
గర్వితవాలిసంహారక రామ | వానరదూతప్రేషక రామ |
హితకరలక్ష్మణసంయుత రామ |

సుందరకాండము-
కపివరసంతతసంస్మృత రామ | తద్గతివిఘ్నధ్వంసక రామ |
సీతాప్రాణాధారక రామ | దుష్టదశాననదూషిత రామ |
శిష్టహనూమద్భూషిత రామ | సీతవేదితకాకావన రామ |
కృతచూడామణిదర్శన రామ | కపివరవచనాశ్వాసిత రామ |

యుద్ధకాండము-
రావణనిధనప్రస్థిత రామ | వానరసైన్యసమావృత రామ |
శోషితశరదీశార్థిత రామ | విభీషణాభయదాయక రామ |
పర్వతసేతునిబంధక రామ | కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
రాక్షససంఘవిమర్ధక రామ | అహిమహిరావణచారణ రామ |
సంహృతదశముఖరావణ రామ | విధిభవముఖసురసంస్తుత రామ |
ఖఃస్థితదశరథవీక్షిత రామ | సీతాదర్శనమోదిత రామ |
అభిషిక్తవిభీషణవందిత రామ | పుష్పకయానారోహణ రామ |
భరద్వాజాభినిషేవణ రామ | భరతప్రాణప్రియకర రామ |
సాకేతపురీభూషణ రామ | సకలస్వీయసమానస రామ |
రత్నలసత్పీఠస్థిత రామ | పట్టాభిషేకాలంకృత రామ |
పార్థివకులసమ్మానిత రామ | విభీషణార్పితరంగక రామ |
కీశకులానుగ్రహకర రామ | సకలజీవసంరక్షక రామ |
సమస్తలోకోద్ధారక రామ |

ఉత్తరకాండము-
ఆగతమునిగణసంస్తుత రామ | విశ్రుతదశకంఠోద్భవ రామ |
సితాలింగననిర్వృత రామ | నీతిసురక్షితజనపద రామ |
విపినత్యాజితజనకజ రామ | కారితలవణాసురవధ రామ |
స్వర్గతశంబుకసంస్తుత రామ | స్వతనయకుశలవనందిత రామ |
అశ్వమేధక్రతుదిక్షిత రామ | కాలానివేదితసురపద రామ |
ఆయోధ్యకజనముక్తిద రామ | విధిముఖవిభుదానందక రామ |
తేజోమయనిజరూపక రామ | సంస్మృతిబంధవిమోచక రామ |
ధర్మస్థాపనతత్పర రామ | భక్తిపరాయణముక్తిద రామ |
సర్వచరాచరపాలక రామ | సర్వభవామయవారక రామ |
వైకుంఠాలయసంస్థిత రామ | నిత్యనందపదస్తిత రామ |

మంగళం-
భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ |
మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ |
ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ |
రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీతా రామ |

గాయత్రీ రామాయణం

గాయత్రీ రామాయణం

తపః స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ || ౧

స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః |
ఋషిభిః పూజితః సమ్యగ్యథేంద్రో విజయీ పురా || ౨

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్ |
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్ || ౩

తుష్టావాస్య తదా వంశం ప్రవిష్య చ విశాంపతేః |
శయనీయమ్ నరేంద్రస్య తదాసాద్య వ్యతిష్ఠత || ౪

వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ |
భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దధౌ || ౫

రాజా సత్యం చ ధర్మం చ రాజా కులవతాం కులమ్ |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణామ్ || ౬

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుమ్ |
ఉటజే రామమాసీనం జటామండలధారిణమ్ || ౭

యది బుద్ధిః కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిమ్ |
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశాః || ౮

భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో |
మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి || ౯

గచ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలమ్ |
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాఽద్య రాఘవ || ౧౦

దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే |
సుఖదుఃఖసహః కాలే సుగ్రీవ వశగో భవ || ౧౧

వంద్యాస్తే తు తపస్సిద్ధాః తాపసా వీతకల్మషాః |
ప్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితైః || ౧౨

స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీమ్ |
విక్రమేణ మహతేజాః హనుమాన్మారుతాత్మజః || ౧౩

ధన్యా దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
మమ పశ్యన్తి యే నాథం రామం రాజీవలోచనమ్ || ౧౪

మంగళాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపేః |
ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనమ్ || ౧౫

హితం మహార్థం మృదు హేతు సంహితం
వ్యతీతకాలాయతి సంప్రతిక్షమమ్ |
నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరః
ప్రసంగవానుత్తరమేతదబ్రవీత్ || ౧౬

ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోఽయం విభీషణః |
లంకైశ్వర్యమ్ ధ్రువం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకమ్ || ౧౭

యో వజ్రపాతాశని సన్నిపాతాన్
న చక్షుభే నాపి చచాల రాజా |
స రామబాణాభిహతో భృశార్తః
చచాల చాపం చ ముమోచ వీరః || ౧౮

యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః |
తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయమ్ || ౧౯

న తే దదర్శిరే రామం దహంతమరివాహినీమ్ |
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మాహాత్మనా || ౨౦

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ |
బద్ధాంజలిపుటా చేదమువాచాగ్ని సమీపతః || ౨౧

చలనాత్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః |
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరమ్ || ౨౨

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదనభోజనమ్ |
సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర || ౨౩

యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్ |
తామేవ రాత్రిం సీతాఽపి ప్రసూతా దారకద్వయమ్ || ౨౪

ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీబీజసంయుతమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఇతి శ్రీ గాయత్రీ రామాయణమ్ సమ్పూర్ణమ్ ||

రామ ద్వాదశనామ స్తోత్రం

రామ ద్వాదశనామ స్తోత్రం

ప్రథమం శ్రీధరం విద్యాద్ద్వితీయం రఘునాయకం |
తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకం || ౧ ||

పంచమం లోకపూజ్యం చ షష్ఠమం జానకీపతిం |
సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాష్టమం తథా || ౨ ||

నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజం |
ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనం || ౩ ||

ద్వాదశైతాని నామాని యః పఠేఛ్రద్ధయాన్వితః |
అర్ధరాత్రే తు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనం || ౪ ||

అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణం |
బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాఽఽది నివారణం || ౫ ||

సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్టనివారణం |
గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః |
అశ్వమేధశతం పుణ్యం బ్రహ్మలోకే గమిష్యతి || ౬ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...