హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, ఫిబ్రవరి 24, 2016

నిత్య పారాయణ శ్లోకాలు:



నిత్య పారాయణ శ్లోకాలు:

సరస్వతీ శ్లోకం:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా | యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా | సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |

లక్ష్మీ శ్లోకం:
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ | దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ | త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||
వేంకటేశ్వర శ్లోకం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌உర్థినామ్ | శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
దేవీ శ్లోకం. సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే | శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||
దక్షిణామూర్తి శ్లోకం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ | నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

అపరాధ క్షమాపణ స్తోత్రం:
అపరాధ సహస్రాణి, క్రియంతే‌உహర్నిశం మయా | దాసో‌உయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా, శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ | విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ, శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ | కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
బౌద్ధ ప్రార్థన. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి

శాంతి మంత్రం:
అసతోమా సద్గమయా | తమసోమా జ్యోతిర్గమయా | మృత్యోర్మా అమృతంగమయా | ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః | సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ||
ఓం సహ నా’వవతు | స నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” || 
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

విశేష మంత్రాః
పంచాక్షరి – ఓం నమశ్శివాయ, అష్టాక్షరి – ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షరి – ఓం నమో భగవతే వాసుదేవాయ

నిత్య పారాయణ శ్లోకాలు

                                                                                                                            

 
నిత్య పారాయణ శ్లోకాలు:

ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు..
ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడికి భక్తితో నమస్కరించి తొలి పూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆదిదేవుడు కాపాడుతాడని అందరి నమ్మకం...
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ గణనాధుని ఆశీర్వాలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, తెలుగు భక్తిని మీకు అందినస్తున్నాం .

ప్రభాత శ్లోకం. 
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||

ప్రభాత భూమి శ్లోకం. 
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||

సూర్యోదయ శ్లోకం. 
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ | సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||

స్నాన శ్లోకం. 
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||

భస్మ ధారణ శ్లోకం. 
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ | లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ||

భోజన పూర్వ శ్లోకం
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః | ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే | గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||

భోజనానంతర శ్లోకం. 
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ | ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||

సంధ్యా దీప దర్శన శ్లోకం. 
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే ||

నిద్రా శ్లోకం. 
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ | శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి ||

కార్య ప్రారంభ శ్లోకం.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః | నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||

గాయత్రి మంత్రం. 
ఓం భూర్భువస్సువః | తథ్స’వితుర్వరే”ణ్యం | భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

హనుమ స్తోత్రం
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ | వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా | అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||

శ్రీరామ స్తోత్రం. 
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

గణేశ స్తోత్రాలు
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ | అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||

ఓం గజాననం భూత గనాది సేవితం, కపిత జంభు ఫల చారు భక్షణం; 
ఉమా సుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం

ఏక దంతయ విద్మహే, వక్రతుండాయ ధీమహీ; తన్నో దంతి ప్రచోదయాత్ 

శివ స్తోత్రం.
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బంధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మా‌உమృతా”త్||

గురు శ్లోకం.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

మహా మాఘి

🌝మాఘ పౌర్ణమి🌝
     మహా మాఘి ........... మాఘ పౌర్ణమిచాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వర్తిస్తుంది. పౌర్ణమి నాడు మఘ నక్షత్రం ఉండుట వలన ఈ మాసానికి మాఘమాసం అని పేరువచ్చిం.
''అకార్తీక మాసం దీపానికెంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో స్నానానికంత ప్రాశస్త్యం. మాఘమాసం సంవత్సరానికి సంధ్యా సమయమంటారు. ఈమాసంగురించి పద్మపురాణంలో వివరంగా ఉంది.
    మాఘస్నానం చిరాయువు, సంపద, ఆరోగ్యం, సౌజన్యం, సౌశీల్యం, సత్సంతానం కలగచేస్తుంది. 'తిల తైలేన దీప శ్చయా: శివగృహే శుభా:' అని శివ పురాణం పేర్కొంది. దీన్నిబట్టి శివాలయంలో ప్రదోషకాలంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సంవత్సరంలో ఇది పదకొండో మాసం. గృహనిర్మాణాలు ప్రారంభిస్తే మంచిది. ఈ మాసంలో ఆదివారాలు విశేషమైనవి. ఆదివారాల్లో స్నానా నంతరం సూర్యుడికి అర్ఘ్యమివ్వడంతో పాటు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం, ఆదివార వ్రతం చేయడం మంచిది. ఆదివారాలు తరిగిన కూరగాయలు తినకూడదంటారు.
   తెలుగునాట మాఘపాదివారాల్లో స్త్రీలు నోము నోచుకుంటారు. ఈ నెల్లో వచ్చే నాలుగాదివారాలు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి సూర్యోదయ సమయానికి సూర్యారాధన చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.
       యజ్ఞంలో అశ్వమేధం, పర్వతాల్లో హిమాలయం,వ్రతాల్లో సత్యనారా యణస్వామి వ్రతం, దానాల్లో అభయదానం, మంత్రాల్లో ప్రణవం, ధర్మాల్లో అహింస, విద్యల్లో బ్రహ్మవిద్య, ఛందస్సులో గాయత్రీ, ఆవుల్లో కామధేనువు, వృక్షాల్లో కల్పతరువు ఎంతగొప్పవో స్నానాల్లో మాఘ స్నానం అంత మహిమాన్వితమైంది. సూర్యుడు మకరరాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఆనాటి నుంచి ప్రాత:స్నానం తప్పక చేయాలి. నదులు, చెరువులు, సముద్రతీరాలదగ్గర లేదా బావివద్దా స్నానంచేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పద్మ పురాణం స్పష్టం చేస్తోంది.
      ప్రతిరోజూ పర్వదినమే: ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమైనవే. శుద్ధ విదియ త్యాగరాజస్వామి ఆరాధన చేస్తే, తదియనాడు ఉమాపూజ, లలితా వత్రం చేయాలంటుంది చతుర్వర్గ చింతామణి. చవితిరోజు ఉమాదేవిని, గణపతిని పూజించాలంటారు. ఇక పంచమిని శ్రీపంచమనీ, మదన పంచ మని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది సరస్వతీదేవి జన్మదినం. సర్వత్రా చదువుల తల్లిని, రతీ మన్మధుల్ని పూజిస్తారు. ఈ రోజున వసంతోత్సవ ఆరంభం అనీ, పంచాంగ కర్తలు వసంత పంచమిని ఉదహరిస్తారు. షష్ఠి రోజున మందార షష్ఠి, వరుణ షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు.
      ఇక మాఘశుద్ధ సప్తమే 'రథసప్తమి'గా జరుపుకుంటారు. ఈ రోజు సూర్యుని పూజించాలి. అష్టమిని భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు భీష్ముడిని పూజించటం సత్ఫలితాలనిస్తుంది. నవమిని మహానంద నవమి అని, స్మృతి కౌస్త్తుభం, నందినీదేవి పూజ చేయాలని చతుర్వర్గచింతామణి చెబుతుంది. ఇక ఏకాదశినాడే పుష్యవంతుడనే గంధర్వుడు ఉపవసించి శాపవిముక్తయ్యాడు. ఈనాడే గోదావరి సాగరసంగమమైన అంతర్వేదిలో శ్రీమహాలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.
      భీముడు ఏకాదశీవ్రతం చేసి, కౌరవులను జయించిందీ రోజే. శుద్ధ ద్వాదశినాడు వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువునీ భక్తి ప్రపత్తులతో అర్చిస్తారు. త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా పాటిస్తారు. విశ్వకర్మ దేవశిల్పి కావటంతో మహాపురుషుడిగా భావిస్తారు. మాఘ పౌర్ణమి అన్ని రోజుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైనది. దీన్ని 'మహామాఘి' అని కూడా పిలుస్తారు.
      బహుళ పాడ్యమినాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. ఇక శ్రీరాముడు రావణ సంహారంకోసం లంకవెళ్ళేందుకు సేతునిర్మాణం బహుళ ఏకాదశి నాడే పూర్తి అయిందంటారు. ద్వాదశి ముందురోజు ఉపవాసముండి ద్వాదశినాడు నువ్వులు దానమిచ్చి, తలస్నానం చెయ్యాలంటారు. అందుకే దీన్ని తిలద్వాదశీ వ్రతం ఆచరిస్తారు.
      ధర్మశాస్త్ర పురాణ తిహాసాలు నేర్చుకునేందుకు త్రయోదశి మంచిరోజని చెబుతారు. బహుళ చతుర్దశి మహాశివరాత్రి. పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవ శుభదినం. ఈనాడు భక్తిశ్రద్ధలతో మనస్సును లగ్నం చేసి ఏకాగ్రతతో మహాశివుణ్ని ఎవరైతే స్మరిస్తారో వారికా పరమేశ్వరుడు తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాంటారు. ఉపవాసం, జాగరణకు ప్రశస్తమైన రోజిది. అమావాస్య స్వర్గస్తులైన పితరులకు తర్పణం వదిలే రోజు.
      అత్యంత మహమాన్వితమైన మాఘమాసం నెలరోజులూ క్రమం తప్పకుండా స్నానదానాదులను నిర్వహించడం వల్ల సకల పాపాలు, సర్వ రోగాలు, దరిద్రాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అన్నిటా జయం లభిస్తుంది. మాఘమాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడికి అభిషేకంచేసి, అర్చించి శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చేస్తే దీర్ఘాయుష్షుతో పాటు సుఖశాంతులు వర్ధిల్లుతాయి.
      కాబట్టి ప్రతివారూ ఈ మాసంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించి పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందేందుకు ప్రయత్నిద్దాం.

ఆదివారం, ఫిబ్రవరి 21, 2016

12 మాఘపురాణం

MAAGHA PURANAM -- 12

మాఘపురాణం - 12వ అధ్యాయము

పుణ్యక్షేత్రములలో మాఘస్నానము
ఈవిధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయం నాకు గలదు. అది ఏమనగా మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల యిట్లనెను.
దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము.
మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను.అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీస్నానంతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కల్గుటయే గాక మరల జన్మ అనేది కలుగదు.
ఇక త్రయంబకమను నొక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరీనది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి, గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోడావరియండు స్నానం చేసినయెడల సకలపాపములు తక్షణం హరించి పోవుటయే గాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే ‘పరంతప’ అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి వున్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం గలదు. ఆ క్షేత్రం బ్రహ్మ హత్యా మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలడు. సావధానుడవై ఆలకింపుము.
విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా! బ్రహ్మదేవుడు నాకు అయిదు తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా నాకు ఐదు వలలున్నవి నేనే గొప్ప వాదనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరిమధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధముచేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మ హత్యాపాతము చుట్టుకున్నది.
శివుడు భయపడి నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి ‘భిక్షాందేహి’యని అనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, ఈతనికి పురుశాత్వము నశించుగాక అని శపించెను.
ఈశ్వరుడు చేయునది లేక జారి క్రిందపడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా? యన్నట్లు భయంకరంగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానినోదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటినుండీ లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివసాన్నిధ్యము పొందగలుగుచున్నారు.

శుక్రవారం, ఫిబ్రవరి 19, 2016

11 మాఘపురాణం

MAAGHA PURANAM -- 11

మాఘపురాణం - 11వ అధ్యాయం

మార్కండేయుని వృత్తాంతము
వశిష్ఠుడుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి –
మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈవిధంగా చెప్పదొడగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను, గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పిరి.
అటుల పదిహేను సంవత్సరములు గడిచిపొయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెననీ తలచి మహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి “మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి?” అని ప్రశ్నించారు.
అంత వశిష్ఠుల వారు “ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవు కమ్ము” అని దీవించితిరి గదా! అదెటుల అగును? ఈతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి. అంతవరకూ మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి. “చిరంజీవివై వర్ధిల్లు”మణి దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి “దీనికి మార్గాన్తరము లేదా? యని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! వినుడు. మనమందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహదేవుని వద్దకు పోవుదము.రండి” అని పలికి తమవెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి.
మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ “చిరంజీవిగా జీవించు నాయనా”యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయపడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయును గాక”యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగనేరదు.అని పలికి, వత్సా! మార్కండేయా! నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండుము. నీకేయాపదకలుగదు. గాన నీవట్లు చేయుము.
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాథుని సేవించి వచ్చెదను. అనుజ్ఞ నిమ్మని కోరగా మృకండుడు అతని భార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి.
కుటుంబ సహితంగా కాశీకిపోయి మృకండుడు కాశీవిశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముగడనే యుండెను. పదహారవయేడు ప్రవేశించెను. మరణ సమయమాసన్నమైనది. యముడు తన భటులతో “మార్కండేయుని ప్రాణములు గొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునా కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించు సరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను.
యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా! అతనిని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మ పాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా! గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి “యమా! నీవు నా భక్తుల దరికి రావలదుసుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.
పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి తానూ చేసిన మాఘ మాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...