హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గురువారం, డిసెంబర్ 25, 2014

చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన



దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు, ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు, అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది. ఓషదులన్ని క్షీణించినవి, అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు. అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. అంత పరమేశ్వ రుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు.
కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. అత్యల్పదూరం అమావాస్య.అత్యధిక దూరం పౌర్ణమి. చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తూఉంటాయి. 16 కళలు అనివీటినే అంటారు. వాటికి పెర్లు ఉన్నాయి -
చంద్రుని పదహారు కళలు: 1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి ధృతి, 7. కామదాయిని, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్స్న, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అపూర్ణ. 15 తిథులకు 16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి,పూర్తి అమావాస్య ఘడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి.
ఈ 16 కళలకు నిత్యం ఆరాధింపవలసిన దేవతలు ఉన్నారు.నిత్యాదేవతలు మొత్తం 16 మంది 15 నిత్యలను త్రికోణంలోని ఒక్కొక్క రేఖ యందు ఐదుగురు చొప్పున పూజించి 16వ దైన లలితా త్రిపుర సుందరీదేవిని బిందువు నందు పూజించాలి.జాతకం ప్రకారం ఎవరు ఏ తిధిన జన్మిస్తే ఆయా దేవతా మంత్రాలను 11 సార్లు జపించాలి.లేదా ఆయా తిధులను బట్టి ఆయా మంత్రాలను ప్రతిరోజు 11 సార్లు పఠించటం మంచిది.అవి
బహుళ పాడ్యమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ విదియ నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ తదియ నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చవితి నాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ పంచమి నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ షష్ఠి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ సప్తమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ నవమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ దశమి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ఏకాదశి నాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ద్వాదశి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ త్రయోదశి నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చతుర్ధశి నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
అమావాస్య నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల పాడ్యమి నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల విదియ నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల తదియ నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల చవితి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల పంచమినాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల షష్ఠి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల సప్తమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల నవమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల దశమి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల ఏకాదశి నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల ద్వాదశినాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల త్రయోదశి నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల చతుర్ధశి నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
పౌర్ణమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి

మంగళవారం, డిసెంబర్ 23, 2014

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం


సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తూ వుంటే శుభలక్షణవంతుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః
* ధ్యానం :
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే

షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే

* షష్టిదేవి స్తోత్రం :
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః
కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః
శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః

* ఫలశృతి :
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే

శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం

శుక్రవారం, డిసెంబర్ 19, 2014

16 కుడుముల తద్దె నోము

                            
                         పూర్వ కాలం నాటి మాట ఆ కాలాన ఒక గ్రామాన శ్రీ లక్ష్మీ ,భూలక్ష్మి అను పేర్లు గల ఇద్దరు అక్క చెల్లెండ్రు ఉండేవారు .వారిద్దరిలో శ్రీ లక్ష్మి నాస్తికురాలు.భూలక్ష్మి ఆస్తికురాలు .అన్నిటిలో ఇద్దరికీ వ్యత్యాసము ఉండేది .లేదా తేడా ఉండేది .భూలక్ష్మికి భక్తి ఎక్కువ ఆ కారణం చే ఆమె ఎవరే నోము నోచమంటే ఆ నోము నోచేది శ్రద్దా భక్తులతో ఆచరించేది .
 
                            ఒకనాడు ఆ గ్రామానికి ఒక పండితుడు వచ్చాడు . ఆయన గ్రామస్తులకు 16 కుడుముల తద్దె నోము గురుంచి వివరించి చెప్పి ఆచరించమని చెప్పాడు. భూలక్ష్మి చక్కగా విని ఎంచక్కా వ్రత మాచరించింది. ఇక శ్రీ లక్ష్మి మాత్రం నాస్తికురాలు కావడం వల్ల వ్రతమా ? పాడా ! వ్రతాలు వద్దూ ,నోములూ వద్దూ అని హాయిగా పిండి వంటలు చేసుకుని తినేది .దేవతలూ లేరు ,దేముళ్ళు లేరు .అంతా ఈ పేరు చెప్పి తినడానికి ఈ వ్రతాలు -నోములు పెట్టారు .అంతా భూటకం ,నాటకం, మాయ, మిధ్య, పనీ -పాట లేని వారు ఇవన్నీ ఏర్పాటు చేసారు .అంతే కాని వీటి వల్ల ఏం ఫలితం ఉండదు. అని ఆమె ఏవేవో మాట్లాడేది . కొన్నాళ్ళకు ఆమె దరిద్రు రాలయింది .ముష్టి త్తుకుని తినేది .ఆమెకు ఎవరూ పిడికెడు బియ్యం కూడా పెట్టె వారు కాదు .తినుటకు తిండి ,ఉండేందుకు ఇల్లు ,కట్టుకునేందుకు బట్ట లేదు. అష్ట కష్టాలు పడసాగింది .పాడు పడిన గౌరీ దేవి గుడిలోనికి వెళ్ళింది. వెక్కి వెక్కి ఏడవ సాగింది .తన గోడంతా ఆ దేవత ముందు చెప్పుకుంది .దయామయి అగు ఆ దేవత ప్రత్యక్షమై -అమ్మా ' శ్రీ లక్ష్మీ ' బాధ పడకు ,విచారించకు . 16 కుడుముల నోము నోయి . అన్ని బాధలు తీరుతాయి . గ్రామస్తుల సహకారం అర్ధించు , తప్పక నీకు సహకరిస్తారు వెళ్ళు అనగా ఆమె ఇంటికి వెళ్లి అందరి సహకారంతో నోము నోచినది .మహిమ అంతే ఆమె ధన వంతురాలయినది . ఉద్యాపన వినండి - పై కధ చదివి పవిత్రాక్షతలు శిరస్సున జల్లుకుని గౌరిని పూజించి 16 కుడుములు ,లక్క జోళ్ళు ,నల్ల పూసలు, దక్షిణ ,తాంబూలం సమర్పించాలి .16 చేటలు 16 మందికి ఇవ్వాలి .అన్నదానం చేయాలి.



గురువారం, డిసెంబర్ 18, 2014

శని శాంతి మంత్రం శని శాంతి మంత్ర స్తుతి

(Shani Shanti Mantra Stuti)

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.

మంగళవారం, డిసెంబర్ 16, 2014

18.శ్రీఆంజనేయ అష్టోత్తరశత నామావళి

 
1.            ఓం ఆంజనేయాయ నమః
2.            ఓం మహావీరాయ నమః
3.            ఓం హనుమతే నమః
4.            ఓం మారుతాత్మజాయ నమః
5.            ఓం తత్వఙానప్రదాయ నమః
6.            ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమః
7.            ఓం అశోకవనికాచ్చేత్రే నమః
8.            ఓం సర్వమాయావిభంజనాయ నమః
9.            ఓం సర్వబంధవిమోక్త్రే నమః
10.          ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
11.          ఓం పరవిద్యాపరిహారాయ నమః
12.          ఓం పరశౌర్యవినాశకాయ నమః

13.          ఓం పరమంత్రనిరాకర్త్రై నమః
14.          ఓం పరమంత్రప్రభోదకాయ నమః
15.          ఓం సర్వగ్రహవినాశినే నమః
16.          ఓం భీమసేనసహాయకృతే నమః
17.          ఓం సర్వదుఖః హరాయ నమః
18.          ఓం సర్వలోకచారిణే నమః
19.          ఓం మనోజవాయ నమః
20.          ఓం పారిజాతదృమూలస్థాయ నమః
21.          ఓం సర్వమంత్రస్వరూపాయ నమః
22.          ఓం సర్వతంత్రస్వరూపిణే నమః
23.          ఓం సర్వయంత్రాత్మకాయ నమః
24.          ఓం కవపీశ్వరాయ నమః
25.          ఓం మహాకాయాయ నమః
26.          ఓం సర్వరోగహరాయ నమః
27.          ఓం ప్రభవే నమః
28.          ఓం బలసిద్ధికరాయ నమః
29.          ఓం సర్వవిద్యాసంపత్తి ప్రదాయకాయ నమః
30.          ఓం కపిసేనానాయకాయ నమః
31.          ఓం భవిష్యశ్చతురాననాయ నమః
32.          ఓం కుమారబ్రహ్మచారిణే నమః
33.          ఓం రత్నకుండలాయ నమః
34.          ఓం దీప్తిమతే నమః
35.          ఓం చంచలధ్వాలసన్నద్ధాయ నమః
36.          ఓం లంబమానశిఖోజ్వలాయ నమః
37.          ఓం గంధర్వవిద్యాయ నమః
38.          ఓం తత్వఙాయ నమః
39.          ఓం మహాబలప్రాక్రమాయ నమః
40.          ఓం కారాగృహవిమోక్త్రే నమః
41.          ఓం శృంఖలా బంధమోచకాయ నమః
42.          ఓం సాగరోత్తరకాయ నమః
43.          ఓం ప్రాఙాయ నమః
44.          ఓం రామదూతాయ నమః
45.          ఓం ప్రతాపవతే నమః
46.          ఓం వానరాయ నమః
47.          ఓం కేసరీసుతాయ నమః
48.          ఓం సీతాశోకనివారకాయ నమః
49.          ఓం అంజనాగర్భసంభూతాయ నమః
50.          ఓం బాలార్కసదృశాననాయ నమః
51.          ఓం విభీషణప్రియకరాయ నమః
52.          ఓం దశగ్రీవకులాంతకాయ నమః
53.          ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః
54.          ఓం వజ్రకాయాయ నమః
55.          ఓం మహాద్యుతయే నమః
56.          ఓం చిరంజీవినే నమః
57.          ఓం రామభక్తాయ నమః
58.          ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
59.          ఓం అక్షహంత్రే నమః
60.          ఓం కాంచనాభాయ నమః
61.          ఓం పంచవక్త్రాయ నమః
62.          ఓం మహాతపసే నమః
63.          ఓం లంకిణీభంజనాయ నమః
64.          ఓం శ్రీమతే నమః
65.          ఓం సింహికా ప్రాణభంజనాయ నమః
66.          ఓం గంధమాదన శైలస్థాయ నమః
67.          ఓం లంకాపుర విదాయకాయ నమః
68.          ఓం సుగ్రీవ సచివాయ నమః
69.          ఓం ధీరాయ నమః
70.          ఓం శూరాయ నమః
71.          ఓం దైత్యకులాంతకాయ నమః
72.          ఓం సురార్చితాయ నమః
73.          ఓం తేజసే నమః
74.          ఓం రామచూడామణి ప్రదాయకాయ నమః
75.          ఓం కామరూపిణే నమః
76.          ఓం పింగళాక్షయ నమః
77.          ఓం వార్ధిమైనాక పూజితాయ నమః
78.          ఓం కబళీకృత మార్తాండ మండలాయ నమః
79.          ఓం విజితేంద్రియాయ నమః
80.          ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః
81.          ఓం మహారావణ మర్ధనాయ నమః
82.          ఓం స్ఫటికాభాయ నమః
83.          ఓం వాగధీశయ నమః
84.          ఓం నవవ్యాకృత పండితాయ నమః
85.          ఓం చతుర్బాహవే నమః
86.          ఓం దీనబంధవే నమః
87.          ఓం మాయాత్మనే నమః
88.          ఓం భక్తవత్సలాయ నమః
89.          ఓం సంజీవ వనాన్న గ్రాహార్థే నమః
90.          ఓం శుచయే నమః
91.          ఓం వాగ్మినే నమః
92.          ఓం దృఢవ్రతాయ నమః
93.          ఓం కాలనేమి ప్రమథనాయ నమః
94.          ఓం హరిమర్కట మర్కటాయ నమః
95.          ఓం దాంతాయ నమః
96.          ఓం శాంతాయ నమః
97.          ఓం ప్రసన్నాత్మనే నమః
98.          ఓం శతకంఠముద్రాపహంత్రే నమః
99.          ఓం యోగినే నమః
100.        ఓం రామకథాలోలాయ నమః
101.        ఓం సీతాన్వేషణ పండితాయ నమః
102.        ఓం వజ్రదంష్టాయ నమః
103.        ఓం వజ్ర నఖాయ నమః
104.        ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
105.        ఓం  ఇంద్రజిత్ ప్రతిహతామోధ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః
106.        ఓం పార్థ ధ్వజాగ్ర సంవాసినే నమః
107.        ఓం శరపంజర భేదకాయ నమః
108.        ఓం దశబాహవే నమః
109.        ఓం లోకపూజ్యాయ నమః
110.        ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
111.        ఓం సీతాసమేత శ్రీరామపాద సేవాదురంధరాయ నమః
ఇతి శ్రీఆంజనేయ అష్టోత్తరశత నామావళి సంపూర్ణం



గురువారం, డిసెంబర్ 11, 2014

శారద స్తోత్రం


నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ
 త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యాదానంచ దేహి మే
 యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేదేవీ విధి వల్లభా
 భాక్తజిహ్వాగ్రసదనా సమాధిగుణదాయినీ
 నమామి యమినీం నాదలోకాలంకృత కుంతలం
 భవానీం భవసంతాపణ సుదానదీం
 భద్రకాల్యై నమో నిత్యం సరస్వతయే నమో నమ
 వేదవేదాంగ వేదాంత విద్యాస్థానేచ ఏవచ
 పరబ్రహ్మ స్వరూపా పరమా జ్యోతి రూపా సనాతనీ
 సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమ:
 యయా వినా జగత్సర్వం మూకమున్మత్త వత్సతా
 యాదేవీ వాగదిస్యాద్రి తస్య వాణ్యై నమో నమ:

బుధవారం, డిసెంబర్ 10, 2014

నిమ్మలగౌరీ నోము

                      భార్యా భర్తలను వేధించే ప్రధాన సమస్య ... సంతాన లోపం. ఈ సమస్య ఆనందాన్ని దూరం చేసి అనుక్షణం ఆవేదనను కలిగిస్తూనే వుంటుంది. అందువలన ఈ శాపాన్ని వరంగా మార్చుకోవడానికి భార్య భర్తలు ఎన్నో నోములు నోస్తుంటారు. అలాంటివాటిలో 'నిమ్మలగౌరీ నోము' ఒకటి.

ఈ నోము నోచుకోవాలనుకున్న వారు కాస్త పెద్దదిగా వున్న ఆరోగ్యకరమైన నిమ్మవేరును సంపాదించి దానిపై చిన్నపాటి 'గౌరీదేవి'ప్రతిమను చెక్కించాలి. మాఘ శుద్ధ సప్తమి (రథ సప్తమి) రోజున పూజా మందిరంలో ఆ ప్రతిమను ఉంచి పూజించాలి. ధూప ... దీపాలు సమర్పించుకుని పంచదార గానీ, బెల్లం గాని నైవేద్యం పెట్టాలి. ప్రతిరోజు కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఇలా ఏడాది పూర్తయిన తరువాత ముగ్గురు పేరంటాళ్లను పిలిచి పూలు ... పండ్లు ... కొత్త వస్త్రాలు ... నల్ల పూసలు ... లక్క జోళ్లు ... ఐదు నిమ్మ పళ్ళను దక్షిణ తాంబూలాలతో పాటు వాయనమిచ్చి ఉద్యాపన చెప్పుకోవాలి.

ఇక ఈ వ్రతానికి కారణమైన కథను గురించి తెలుసుకుందాం. పూర్వం ఓ గ్రామంలో పద్మగంధి - పద్మనాభుడు అనే దంపతులు వుండేవారు. ధన ధాన్యాల విషయంలో వారికి ఎలాంటి లోటూ లేదు. అయితే సంతానం లేకపోవడం వారిని మానసికంగా కుంగదీస్తూ వస్తోంది. దాంతో ఇరుగు పొరుగు వారి మాటలు నమ్మి వారు ఎన్నో తీర్థ యాత్రలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆ దంపతులు మరింత దిగాలు పడిపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వచ్చిన ఓ మహర్షిని వాళ్లు కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. దాంతో ఆ మహర్షి 'నిమ్మలగౌరీ నోము' నోచుకోమంటూ దాని విధి విధానాలను వారికి వివరించాడు. ఆయన చెప్పినట్టుగానే చేసిన ఆ దంపతులకి, కొంత కాలానికి సంతానం కలగడంతో వారి ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఆ రోజు నుంచి ఆ దంపతులు ఈ వ్రతానికి మరింత ప్రచారం కల్పించి, మరెంతో మంది సుఖ సంతోషాలకు కారకులయ్యారు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...