హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, మే 28, 2012

లఘు గాయిత్రి , బృహద్గాయిత్రి యంత్ర మంత్రములు

లఘు గాయిత్రి , బృహద్గాయిత్రి  యంత్ర మంత్రములు
శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం
ఈ యంత్ర మహిమచే ఙ్ఞాపక శక్తి సంపద బ్రహ్మ  ఙ్ఞానం కలుగును. యంత్రాది దేవత అయిన గాయిత్రి మాతను ఫల పత్ర పుష్పాదులచే పూజించి మూల మంత్రమును ప్రతి నిత్యము యధా శక్తి గా జపించవలెను. పాప క్షయము కలిగి పరమ మోక్షమును పొందెదరు.
 మూల మంత్రము : - ఓం భూర్బువస్సుః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్||
శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం
బృహద్గాయత్రీ మూల మంత్రం :-   ఓం భూర్బువస్సుః ఓం తత్సవితు బ్రహ్మణే నమః వరేణ్యం విష్ణవే నమః ధియోయోనః సదాశివాయ నమః ప్రచోదయాత్ సర్వాత్మనే నమః  - ఈ మూల మంత్రమును యధా శక్తి గా జపించు వారలకు సంతాన ప్రాప్తి ఐశ్వర్యాభి వృద్ధి , యశస్సు , ముక్తి లభించును.

మంత్రసాధనలు- విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు


  మంత్రసాధనలు- విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు

  విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు:-  ఆరు విధములైన విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు ఇక్కడ పొందుపరచుచున్నాను. 


  1.    మం\\ " ఓం  ఐం  హ్రీం  శ్రీం క్లీం సౌః   క్లీం  హ్రీం ఐం  బ్లూం స్త్రీం  నీలకరే  సరస్వతీ, ద్రాం ద్రీం క్లీం బ్లూంసః  ఐం హ్రీం  శ్రీం సౌః  హ్రీం స్వాహా " 
 ఈ మంత్రమును రాగిరేకుపై వ్రాసి ప్రతిష్ఠ గావించి షోడశోపచార పూజలుచేసి ఈ మంత్రమును ఏకా గ్రచిత్తుడై లక్షపర్యాయములు జపించి, వసకొమ్ములు, పిప్పలి, మోదుగ,సమిధిలతోటి పదివేల పర్యాయములు హోమము గానించి ఆరాగి రేకును తావీజునందు బెట్టి ధరించిన, పరమ మూర్ఖుడై యున్నను గొప్ప విద్యా వంతుదు కాగలడు విద్యను కలిగించి పాండిత్య ప్రకర్షమొనర్చుటయం దీ మంత్రము అమోఘమైనది.
 2    మం\\    మేథాం విద్యాం  బల  ప్రజ్ఞాంసంపదం పుత్రాపౌత్రికామ్ 
                     దేహిమే  శారదాదేవీ , స్మరామి ముఖ సంస్ధితామ్ ||
         ఈ శ్లోకమును ప్రతి నిత్యము 21 మార్లు పఠింపుచున్న దేవి బుద్ధి జాడ్యమును హరించి,విద్యా వినయ సంపదలనొసంగ గలదు.     
3.  మం\\   ఓం  " హీం హ్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః   సరస్వత్స్యై స్వాహా "
       ఈ మంత్రమును వ్రతదీక్ష బూని 12 లక్షలు జపించిన సిద్ధింప గలదు. ఈ మంత్ర సిద్ధిని పొందిన నరుడు  కేవలం వినినంత మాత్రమున, చదివినంత మాత్రమున సర్వ విద్యలను అవగతము గావించు కొనగలడు. అన్ని భాషలు అతని ఆధినములై యుంటవి. విఙ్ఞాన ధురీణులైన మేధావులకు కలుగు సందేహములను గూడా ఈసిద్ధి నందినవాడు తేలికగా పరిష్కరింప గల సమర్ధుడు కాగలడు.
       ఈ మహాసరస్వతీ మంత్రసిద్ధినందిన వ్యక్తి. ఏ శిశువుకైనను జన్మించిన మూడు దినముల లోపల ఆవు నెయ్యి, తేనె కలిపి బంగారు పుల్లతో ఈ మంత్రమును ఆ శిశువు  నాలుకపై  వ్రాసి అభి మంత్రించిన ఆ శిశువు   13 సం\\లు వచ్చుసరికి గురువును మించిన విద్య పాండిత్యము గలవాడగును.  దీని మహిమ అనన్య సమాన్యమై యున్నది. దీనికి చింతామణి సరస్వతి మంత్ర మని గాడా పేరున్నది. విద్య పాండిత్యములతో బాటు తరగని ధనసంపదను సభాపూజ్యత కీర్తి ప్రతిష్ఠలు కూడా ఈ మంత్ర ప్రభావము వలన చేకూరగలవు.  
4.  మం\\  వాణీల పూర్ణనిశాక రోజ్జ్వలముఖీం కర్పూరకుంద ప్రభాం 
                చంద్రార్థాంకితమ స్తకాం నిజక రైస్సంచి భ్రతీమాదరాత్  
                 వర్ణాకుక్ష గుణం సుధాద్యకలశం విద్యాంచత్యుగస్తనీం 
                 దివ్యైరాభరణ్తే  ద్విభూషితతనుం  సింహాధిరూ ఢాంభజే ||
                ఈ శ్లోకమును ప్రతి నిత్యము క్రమము తప్పకుండా ప్రాతఃకాలంలో 18 మార్లు పఠింపుచున్న విద్యాభ్యాసము నందు గలగు శంకలు తొలగి, స్ఫూర్తి  ఙ్ఞాపకశక్తి, మేధాశక్తి అభివృద్ధి యగుటయే కాక విద్యాజయము నందగలరు. 
 5. మం\\ " ఓం హ్సీం విశ్వోత్తీర్ణ  స్వరూపాయ చిన్మయానంద రూపిణీ తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ  హ్సీం ఓం నమః "
                భక్తి ప్రపత్తులు గల్గి ఈ మంత్రమును శుచిగల ప్రదేశములో ఒక లక్ష పర్యాయములు జపించుట వలన మందబుద్ధి గలవారికి బుద్ధి వికాసమై, కఠినమైన విద్యాలుగూడా కరతలామలకము కాగలవు, పండితుడై సభలందు గౌరవము నందగలడు.
6. మం\\ " ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛస్వాహా "
         ఈ మంత్రమును ఏకాంత ప్రదేశంలో కూర్చుని బ్రహ్మ చర్య దీక్షతో 11 రోజులు 11 వేలు జపించిన యెడల అపార మేధా శక్తి, బుద్ది సూక్ష్మత గ్రాహ్యత ప్రతిభ లభించి అన్ని విద్యలందు అఖండ విజయాన్ని పొందగలరు.
        

శనివారం, మే 26, 2012

మంత్రసాధనలు- కోరికలు నెరవేరుటకు మంత్రములు


మంత్రసాధనలు- కోరికలు నెరవేరుటకు మంత్రములు

        కార్యసాధనామంత్రములు:-  ఏడు విధములైన  కోరికలు నెరవేరుటకు  మంత్రములు ఇక్కడ పొందుపరచుచున్నాను. 


       1.    మం\\  ఓం క్లీం హ్రీం రుం ద్రుః ఘ్రీం హ్రీం భైరవాయ నమః ||


       ఈ మంత్రమును 24000  పర్యాయములు జపించిన యెడల భైరవ స్వామి స్వప్న దర్శన మగును.  శివుని సన్నిధిలో స్థిర చిత్తముతో ఏకాంతముగా జపము చేయవలెను. అట్లైన ప్రయత్నము లేకుండానే మనస్సు లోని కోరికలు నెరవేరగలవు.  

       2    మం\\     ఓం క్రీం క్రీం క్రీం హూం హుం హ్రీం హ్రీం భైం భద్రకాళీ భైం హ్రీం హ్రీం హుం హూం క్రీం క్రీం క్రీం స్వాహా || 
           
               ఈ మంత్రమును శక్తి ఆలయంలో  ధ్యాన పూర్వకముగా 10000 సార్లు జపించి ఇష్ట బలి గావించిన కష్టతరమైన కోరికలు కూడా సత్వరముగా ఫలించగలవు. ( కాని మనో నిగ్రహం బాగా ఉండాలి )

   3.  మం\\   ఓం శ్రీం హ్రీం జయ లక్ష్మీ ప్రియాయ నిత్య ప్రముదిత చేతసే లక్ష్మీ శ్రితార్థదేహయ శ్రీం హ్రీం నమః ||

            ఈ మంత్రమును నృశింహ స్వామిని పూజిస్తూ 40 రోజులు లక్ష పర్యాయములు జపించిన ఊహాతీతముగా అన్ని కోరికలు నెరవేరగలవు. 

  4.  మం\\  సర్వానర్ధ హరం దేవం సర్వ మంగళ మంగళమ్ 
                  సర్వక్లేశ హరం  వందే స్మర్తృగామీ సనోనతు ||

             ఈ మంత్రమును ప్రతి నిత్యము పఠించు చున్న అభీష్టసిద్ధి జయము కలుగును. జప సంఖ్య లేదు.

  5. మం\\  వందే పద్మకరాం ప్రశన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం 
                హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానావిధై ర్భూషితాం 
                 భక్తా భీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మా దిభి స్సేవితాం
                పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధి భిర్యుక్తాం సధా శక్తిభిః  ||

            ఈ మంత్రమును  ఆసనమున కుర్చుండి లేవకుండా 108 పర్యయములు పఠించిన భాగ్యవంతులగుట తథ్యం . దారిద్య బాధలంతరించి కోరికలన్నీ నెరవేరుతాయి.

  6. మం\\  రోగానశేషా నపహంసి తుష్టా 
                 దదాసికామాన్ సకలానభిష్టాన్ 
                 త్వామాశ్రితానాం నవిపన్నరాణాం
                 త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ||

             ఈ మంత్రమును ప్రతినిత్యము 24 మార్లు భక్తిగా పఠించిన అనతి కాలంలోనే కష్టములు తీరి కోరికలు నెరవేరి సుఖపడగలరు . 
         
  7.   మం\\   ఓం ఐం క్లీం సౌః క్లీం ఐం

                    ఈ మంత్రమును  లక్ష సార్లు జపించి జాకి పూలతో దేవి పూజ గావించి పాయస నైవేద్య మిచ్చిన తలచిన కోరికలు సత్వరమే నెరవేరగలవు. 
            


శుక్రవారం, మే 25, 2012

మత్స్య యంత్రం


మత్స్య యంత్రం

             


 శ్రీ   మత్స్య యంత్రంను  
                శ్లో ||   స్వర్ణేన రజతే  నాపి  పంచాంగుళ  ప్రమాణకమ్ |
                         యంత్రపత్రం  విరచ్యాధ  సప్తకోణం  లిఖేత్పురమ్ |
                         వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |
                         మధ్యేతు మత్స్య  మాలిఖ్య  గృహస్థాపన శోభనమ్ |
                         అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |
                         శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ || 
                           
                               పై యంత్రమును ఐదు శేర్ల ధాన్యము నందు ఒక దినము , పంచామృతములందు ఒక దినము మంచి నీటి యందు ఒక దినము ఉంచి పూజించి  సహస్రాష్టోత్తర శతగాయత్రి   జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహము స్థలముల యందు ఈ యంత్రమును స్థాపించ వలెను.
                 ఈ యంత్రమును స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు  , కూప వేధలు , స్తంభ వేధలు ,
వీధీ శూలలు   ఆయుర్ధాయము  నశించిన  గృహ దోషములు  , శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును 
మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.
    
          


























                      -: మత్స్య గాయత్రి :-
    జలచరాయ    విద్మహే మహామీనాయ   ధీమహి తన్నోమత్స్యః     ప్రచోదయాత్.//  




  



































































                          

బుధవారం, మే 23, 2012

మంత్రసాధనలు- కార్యసాధనామంత్రములు

              మంత్రసాధనలు- కార్యసాధనామంత్రములు

        కార్యసాధనామంత్రములు:-  పది విధములైన కార్యసాధనా మంత్రములు ఇక్కడ పొందుపరచుచున్నాను. 


       1.    మం\\     సుముఖశ్చైకదంతశ్చ కపిలో  గజ కర్ణికహ్శ్చ్
                     లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపహ్
                     ధూమ కేతు ర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననహ్
                     వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజహ్//
                        ఈ శ్లోకమును ఏ పనికైనా బయలుదేరుటకు ముందు 16 సార్లు పఠించి
         వెళ్ళిన విఘ్నములు కలుగకుండా నివారింపబడి కార్యసిద్ధి చేకూర గలదు.
    2    మం\\      ‘’వక్రతుండాయ హుం ‘’
                                ఈమంత్రమును  శుక్ల పక్ష చవితినాడు ప్రారంభించి
    ఒక లక్ష  సార్లు జపించి విఘ్నేశునికి అటుకులు పాలు పాయసము నివేదించిన వారికి అన్ని
     విఘ్నములు తొలగిపోయి సకల కార్యసిద్ధి చేకూరగలదు.            
   3.  మం\\    ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
             లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం//
                          ఆపదలుకలుగగలవని సందేహమున్నప్పుడు ఈమంత్రమును 21 మార్లు
             పఠించిన క్షేమము గలుగును.
  
  4.  మం\\ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే
          శరణ్యే త్ర్యంబికే దేవీ నారాయణి నమోస్తుతే//
                      ఈ శ్లోకమును32 మార్లు పఠించిన విజయము లభింపగలదు.

 5. మం\\ నమోऽస్తురామాయ సలక్ష్మణాయ
         దేవ్యైచ తస్మై జనకాత్మజాయ
         నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య
         నమోస్తుచంద్రార్క మరుద్గణేభ్యహ్//
                  ఇది ఆంజనేయ కౄత మంత్రము ,పనులు పేచీలుగా ఉన్నప్పుడు
    ఆటంకములు తొలిగి పోవుటకు 15 సార్లు పఠించిన  పనులు పూర్తి కాగలవు. 
  6. మం\\  ఓం కార భవన స్ధానంశంకరం దామతేజసాం
          శివంవందే వాసవాబ్జం భూనారాణసేవితం//
                    జపము పూజ ఏకాంతము మొ|| లగు  వాటి యందు విఘ్నములు తొలగి  త్వరగా సిద్ధి కలుగును. 54 మార్లు రోజుకు పఠించవలెను.
    7.   మం\\  ఐం బీజ మాదిందు సమాన దీప్తిం
               హ్రీం సూర్యతేజోద్యుతి మద్వితీయం
               క్లీం  మూర్తి వైశ్వానర తుల్య రూపం
               తౄతీయ ద్యూనంతు శుభామానం
        ఈ మంత్రమును 40 రోజులు రోజుకి 21 మార్లు అర్ధరాత్రి సమయంలో పఠించిన
   శత్రు ఆటంకములు తొలగి కార్యసిద్ధి కలుగును.
  8. మం\\  ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరద వరద సర్వ జనంమే వసమానయ  స్వాహా ||
          ఈ మంత్రమును మంగళవారం ప్రారంభించి ఒక లక్ష పర్యాయములు జపించి వినయకునికి ఉండ్రాళ్ళు , చెరుకు ముక్కలు నివేదించి ఎర్ర గన్నేరు పూలతో పూజించిన గ్రామ కక్షలు తొలగి జనులు ప్రసన్నులు కాగలరు. అట్లే మల్లెపూలు నేతి లో తడిపి హోమము గావించిన గ్రామజన సభా ,రాజ వశ్యములు కాగలవు. దీనికి సాటియగు మంత్రము లేదు. 
9.   మం\\ సీతామనోమానస రాజహంస
       సంసార సంనాశహర క్షమాళో
       శ్రీరామ దైత్యాంతక శాంతరూప
       శ్రీ తారక బ్రహ్మ నమోనమస్తే ||
                    ఈ మంత్రమును 108 మార్లు పఠించిన కుటుంబ కలహములు తొలగి
  ఈతిబాధలంతరించి సుఖ శాంతులు కలుగును.     
10.      మం\\ ఓం మణి ధరణి వజ్రిణి శిఖరిణి సర్వవశంకరణి హుం పట్ స్వాహా ||
       ఈ మంత్రమును శుద్ధ నవమి నాడు ప్రారంభించి 40 దినములు పఠించిన వౄత్తి వైషమ్యములు   తొలిగి విజయము చేకూరగలదు. జపము చేయు సమయములలో ప్రతి శుక్రవారం దేవీ కుంకుమ పూజ చేయాలి. రోజుకి 2500 జపము. శత్రువులు మిత్రులై సహాయపడగలరు.



శని అష్టోత్తర శతనామావళి

                   శని అష్టోత్తర శతనామావళి
                         

శని అష్టోత్తర శతనామావళి ఇక్కడ చూడవచ్చు. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం.

ఓం శనైశ్చరాయ నమః
శాంతాయ నమః
సర్వాభీష్ఠాప్రదాయినే నమః
శరణ్యాయ నమః
వరేణ్యాయ నమః
సర్వేశాయ నమః
సౌమ్యాయ నమః
సురవంద్యాయ నమః
సురలోకవిహారిణే నమః
సుఖాసనోపవిష్ఠాయ నమః
సుందరాయ నమః
ఘనాయ నమః
ఘనరూపాయ నమః
ఘనాభరణధారిణే నమః
ఘనసారవిలేపాయ నమః
ఖద్వోతాయ నమః
మందాయ నమః
మందఛేష్ఠాయ నమః
మహనీయగుణాత్మకాయ నమః
మర్త్యపావనపాదాయ నమః
మహేశాయ నమః
ఛాయాపుత్రాయ నమః
శర్వాయ నమః
శరతూణీరధారిణే నమః
చరస్థిరస్వభావాయ నమః
చంచలాయ నమః
నీలవర్ణాయ నమః
నిత్యాయనమః
నీలాంజననిభాయాయ నమః
నీలాంబరవిభూషాయ నమః
నిశ్చలాయ నమః
వేద్యాయ నమః
విధిరూపాయ నమః విరోధాధారభోయే నమః
వేదాస్పదస్వభావాయనమః
వజ్రదేహాయ నమః
వైరాగ్యదాయినే నమః
వీరాయ నమః
వీతరోగభయాయ నమః
విపత్పరంపరేశాయ నమః
విశ్వవంధాయ నమః
గృధ్రవాహాయ నమః
గూఢాయ నమః
కూర్మాగాయ నమః
కురూపిణేనమః
కుత్సితాయ నమః
గుణాఢ్యాయ నమః
గోచరాయ నమః
అవిద్యామూలనాశాయ నమః
విద్యావద్యాస్వరూపిణేనమః
ఆయుష్యకారణాయ నమః
ఆపదుద్దర్త్రే నమః
విష్ణుభక్తాయ నమః
వశినే నమః
వివిధాగమవేదినే నమః
విధిస్తుత్యాయ నమః
వంద్యాయ నమః
విరూపాక్షాయ నమః
వరిష్ఠాయనమః
గరిష్ఠాయ నమః
వజ్రాంకుశధరాయ నమః
వరదాయ నమః
అభయహస్తాయనమః
వామనాయ నమః
జ్యేష్టాపత్నీసమేతాయ నమః
శ్రేష్ఠాయ నమః
అమితభాషిణే నమః
కష్ఠౌఘనాశకాయ నమః
ఆర్యపుష్ఠిదాయినే నమః
సుత్యాయనమః
స్తోత్ర గమ్యాయనమః
భక్తివశ్యాయ నమః
భానవే నమః
భవ్యాయ నమః
పావనాయ నమః
ధనుర్మండలసంస్థాయ నమః
ధనాదాయినే నమః
తమఃపకాశదేహాయ నమః
తామసాయ నమః
అశేషజనవంద్యాయ నమః
విశేషఫలదాయినే నమః
వశీకృతజనేశాయ నమః
పశూనాంపతయే నమః
ఖేచరాయ నమః
ఖగేశాయనమః
నీలాంబరాయ నమః
కాఠిన్యమానసాయ నమః
ఆర్యగణస్తుత్యాయ నమః
నీలఛ్ఛత్రాయ నమః
నిత్యాయ నమః
నిర్గుణాయ నమః
గుణాత్మనే నమః
నిరామయాయ నమః
అనింద్యాయ నమః
వందనీయాయ నమః
ధీరాయ నమః
దివ్యదేహాయ నమః
దీనార్తిహరాయ నమః
దైన్యనాశనకర్త్రేనమః
ఆర్యజనగణ్యాయనమః
క్రూరాయ నమః
క్రూర చేష్టాయ నమః
కామక్రోధరాయ నమః
కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః
పరిభీతిహరాయనమః
భక్తసంఘమనోభీష్టఫలదాయ నమః

ఇతి శ్రీశన్యష్టోత్తర శతనామావళిః సంపూర్ణం

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...